NTV Telugu Site icon

Snacks: ఈ స్నాక్స్ తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!

Snacks

Snacks

సాయంత్రం అయిందంటే వీధుల్లోకెళ్లి ఏదొక స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. రోజు క్రమం తప్పకుండా వెళ్లి తినేవారు చాలా మంది ఉన్నారు. రుచికి బాగుండటంతో వాటికే అలపడి రోజూ కడుపులో పడేస్తారు. అయితే.. ఆ స్నాక్స్ తింటే మన ప్రాణానికి ప్రమాదమని మీకు తెలుసా..! ఎందుకంటే వాటిల్లో ఉండే.. సంతృప్త కొవ్వులు, చక్కెర, లవణాలు , శుద్ధి చేసిన పిండి కారణంగా అవి చాలా అనారోగ్యకరమైనవి. స్నాక్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు, గుండె ప్రమాదం, బరువు పెరుగుతారు. అయితే.. ఎక్కువగా ప్రమాదకరమైన 5 రకాల స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rajini Kanth: మనసిలాయో అంటున్న రజనీకాంత్

బిస్కెట్లు-కుకీలు:
బిస్కెట్లు, కుకీలను ఎక్కువగా టీ మరియు కాఫీలో వేసుకుని తింటారు. దాదాపు.. భారతీయులందరూ ఇలా తినడానికే ఇష్టపడతారు. అయితే.. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే.. బిస్కెట్లలో ఉండే వెన్న, పంచదార, పిండిలో చాలా శాతం సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. దానివల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. బిస్కెట్లలో 30-50 శాతం సంతృప్త కొవ్వు ఉంటుంది. సాధారణంగా బిస్కెట్‌లో 200-300 కేలరీలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. కానీ వీటిలో ఎక్కువగా పిండి, కొవ్వుల నుండి వచ్చే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిండి పదార్థాలు ఆరోగ్యకరమైనప్పటికీ, వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యకరమైన డైజెస్టివ్ బిస్కెట్లలో కూడా కేవలం 20 శాతం గోధుమలు మాత్రమే ఉంటాయి. మిగిలిందంతా ఎమల్సిఫైయర్లు, పామాయిల్ ఉంటాయి. ఇవి.. ఊబకాయాన్ని కలిగిస్తాయి.

పానీ పూరీ/గోల్ గప్పా:
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీ పూరీ ఒకటి. కొత్తిమీర-పుదీనా నీరు, చింతపండు చట్నీ, బంగాళాదుంప, చిక్‌పీస్‌లతో డీప్-ఫ్రైడ్ చేస్తారు. పానీపూరీని తినొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తినొద్దని.. ఎందుకంటే కాలుష్యం వంటి ప్రమాద కారకాలు ఉంటాయని చెబుతున్నారు.

అరటి చిప్స్:
అరటి చిప్స్ తినడానికి రుచికరంగా ఉంటాయి. అంతే తేలికగా కూడా ఉంటాయి. అరటి చిప్స్ను పచ్చి అరటిపండ్లు, ఉప్పు, మసాలాతో తయారు చేస్తారు. ఇవి కూడా ఆరోగ్యానికి అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. 72 గ్రాముల అరటిపండు చిప్స్ 24 గ్రాముల కొవ్వును తయారు చేస్తుంది. ఇవి తినడం వల్ల.. గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి.

కచోరీస్:
కచోరీలు కూడా అనారోగ్యకరమైనవి. ఎందుకంటే వీటిని డీప్-ఫ్రైడ్ చేస్తారు. వీటిల్లో అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కచోరీలో 200-300 కేలరీలు ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్-పర్పస్ పిండితో తయారు చేయబడిన కచోరిస్‌లో గణనీయమైన మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది.

మోమోస్:
మోమోస్ స్టాల్స్ ప్రతి వీధిలో ఉంటాయి. ఇవి.. రుచిగా ఉన్నప్పటికీ, మోమోస్ మీ జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. మోమోస్ వల్ల ఉబ్బరం, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది.