Road Accident: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!

Nalgonda Road Accident

Nalgonda Road Accident

5 Dead in Nalgonda Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు నిడమానుర్ మండలం వేంపాడు స్టేజ్ పక్కనే ఉన్న చౌదరి హోటల్ వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 8 గంటల సమయం!

×
×
Ad

మృతులు పెద్దవుర మండలం పుల్య తండాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అని తెలుస్తోంది. మృతులు రమవత్ కేశవులు (19), రమవత్ పాండ్య (40), రమవత్ గణ్య (40), రమవత్ బుజ్జి (38)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి పది గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ మరణాలతో పుల్య తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.