NTV Telugu Site icon

Breaking News: ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి.. ఆ జిల్లాలో ఏకంగా 35 మంది

ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35మంది మృత్యువాద పడ్డారు. ఇంకా ఒకరి జాడ దొరకలేదు. గుంటూరు జిల్లాలో ఏడుగురు చనిపోయారు. పల్నాడు, ఏలూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మృత్యువొడికి చేరుకున్నారు. వర్షాలు వల్ల 339 రైళ్లు రద్దయ్యాయి. 181 రైళ్లు దారి మళ్లించారు. 1,81,53870 హెక్టార్ల లో పంట , 19686 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. 2లక్షల35 వేల మంది రైతులు నష్టపోయారు. 71 వేల కోళ్లు, 478 పశువులు మరణించాయి. వరదల వలన 22 సబ్ స్టేషన్ లు దెబ్బతిన్నాయి.

READ MORE: NHAI Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త.. NHAIలో టెక్నికల్ పోస్టులు..

3913 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అర్బన్ రోడ్స్ 558 కిలోమీటర్లు మేర దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. 6,44133 మంది వరదల వల్ల ప్రభావమయ్యారు. 246 రిలీప్ క్యాంపుల్లో 48,528 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు రంగంలో దిగాయి. ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి.208 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కృష్ణా నదికి 3లక్షల 82 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. పులిచింతలకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది.