ADR Report: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌లు ఈ వివరాలను వెల్లడించాయి. 22 రాష్ట్ర అసెంబ్లీలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎంఎల్‌ఎలకు గాను 4001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. వీరిలో 1,136 మంది అంటే 28 శాతం మంది తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు లాంటి తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించింది.
Also Read: Janasena: ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేనకు ఆహ్వానం
కేరళలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకు గాను.. 95 మందికి నేర చరిత్ర ఉందని, 70 శాతం నేరచరిత ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే బీహార్‌లోని 242 మంది ఎమ్మెల్యేలలో 161 మంది (67 శాతం), ఢిల్లీలోని 70 మందిలో 44 మంది(63శాతం), మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేలలో 175 మంది(62 శాతం) తెలంగాణలోని 118 మంది శాసన సభ్యుల్లో 72 మంది(61శాతం), తమిళనాడులో224 మంది ఎమ్మెల్యేలలో 134 మంది(60 శాతం)తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఢిల్లీలో 37 మంది (53 శాతం), బీహార్‌లో 122 మంది (50 శాతం) మహారాష్ట్రలో 114 మంది(40 శాతం), జార్ఖండ్‌లో 31మంది(39 శాతం), తెలంగాణలో46 మంది(39శాతం), ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం403 మంది ఎమ్మెల్యేలలో 155 మంది (38శాతం)తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించడం గమనార్హం. ఇందులో కూడా 114 మంది ఎంఎల్‌ఎలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు కూడాఆ వివరాలు వెల్లడించడం గమనార్హం. 1 14 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిసింది.
పార్టీలవారీగా చూస్తే నేరచరిత ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కు వ మంది బీజేపీకి చెందినవారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పార్టీకి చెందిన 1,356 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించగా 473 మంది(35శాతం)కి నేరచరిత్ర ఉన్న ట్లు తేలిందని, వారిలో 337(25శాతం) మంది సీరియస్ నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొంది. 2, 3 స్థానాల్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలుండగా.. వైఎస్సార్‌సీపీ 6, బీఆర్‌ఎస్ 8 స్థానాల్లో ఉన్నట్లు వివరించింది. 22వ స్థానంలో మజ్లిస్, 26వ స్థానంలో తెలుగుదేశం పార్టీలున్నాయి.
Also Read: Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
ఈ నివేదిక క్రిమినల్ కేసులే కాకుండా ఎమ్మెల్యేల ఆస్తులను కూడా విశ్లేషించింది. రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే తలసరి సగటు ఆస్తి రూ.13.63 కోట్లుగా ఉందని పేర్కొంది. అయితే క్రిమినల్ కేసులున్న వారి ఆస్తులు కేసులు లేని వారి సగటు ఆస్తులకన్నా ఎక్కు ఉండడం విశేషం. క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.45 కోట్లుగా ఉండగా , కేసులున్న వారి సగటు ఆస్తి రూ.16.36 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా..కర్ణాటక ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.64.39 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రూ.28.24 కోట్ల సగటు ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, రూ.23.51 కోట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. కాగా అతితక్కువ ఆస్తుల విషయంలో రూ.1.54 కోట్లతో త్రిపుర మొదటి స్థానంలో ఉండగా, రూ.2.80 కోట్లతో పశ్చిమ బెంగాల్, రూ.3.15 కోట్లతో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా మొత్తం 4001 మంది ఎమ్మెల్యేల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న వారు 88 శాతం ఉండడం విశేషం. ఈ విషయంలో కర్నాటక 32 మందితో అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. తెలంగాణ కింది నుంచి మూడో స్థానంలో ఉంది. బిలియనీర్లలో అత్యధికులు కాంగ్రెస్(33 మంది) ఉండగా.. వైసీపీ 8 మందితో మూడో స్థానంలో ఉంది. ఎమ్మెల్యేల్లో అత్యంత ధనికుడిగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ (రూ.1,413 కోట్లు) ఉన్నారు.