44 AP Residents stranded in Nepal: నేపాల్‌లో ‘జెన్‌జీ’ ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, విధ్వంసానికి దారి తీసింది.. నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుండగా.. ఈ సమయంలో.. ఏపీకి చెందిన మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు..
Read Also: Medicine Profit Margins: మెడికల్ మాఫియా..? రూ.20కి వచ్చే దగ్గు మందు.. రూ.100కి విక్రయిస్తున్నారు?
ఇక, 14వ తేదీన యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు చేశారు కలెక్టర్ రాజకుమారి.. అయితే, షోలే ట్రావెల్స్ ద్వారా 3వ తేదీన 12 రోజుల ముక్తినాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది 44 మంది భక్తుల బృందం.. ఈ టీమ్‌లో నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పోరుమావిళ్ల, సున్నిపెంటవాసులు ఉన్నట్టుగా చెబుతున్నారు.. నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. రాజధాని ఖాట్మాండ్ లో రెండు రోజులుగా రూమ్‌లకే పరిమితమయ్యారు యాత్రకులు.. మొత్తంగా మంత్రి ఫారూఖ్ చొరవతో యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. రేపు ఖాట్మాండ్ నుండి నేపాల్ – ఇండియా సరిహద్దుల్లోని భైరవ్ ప్రాంతానికి విమానంలో బయలుదేరనున్నారు యాత్రికులు.. అక్కడినుండి వోల్వా బస్సులో యూపీలోని గోరకపూర్ కు , అక్కడి నుండి విమానంలో హైదరాబాద్ కు వస్తారు.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది యాత్రికుల బృందం.. యాత్రికులు క్షేమంగా ఉన్నారని , కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఫరూఖ్..
