టెన్త్, ఐటీఐ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్స్, డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ ఇలా పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
Also Read:Botsa Satyanarayana: కాశీబుగ్గ బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా..?
అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.10,560 స్టైఫండ్ అందిస్తారు. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.