NTV Telugu Site icon

Sad Incident: చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడ్డ 4 నెలల పసికందు.. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు

Pasikandu

Pasikandu

పిల్లలంటే ఇష్టపడని తల్లిదండ్రులు ఎవరుంటారు చెప్పండి. పుట్టిన దగ్గరి నుంచి వారిని అల్లారుముద్దారుగా పెంచుకుంటారు. పిల్లలు ఏడ్వకుండ.. లాలిస్తూ పాలిస్తూ పెంచుతారు తల్లిదండ్రులు. వారిని తీసుకుని ఎక్కడైనా వెళ్తే.. ముందు వెనుక జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు. అయితే ఈ తల్లిదండ్రుల దురదృష్టాన్ని చూస్తే.. మీరు అయ్యో పాపం అంటారు. 9 నెలలు కడుపులో పెంచిన ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో.. అలాంటి ఘటనే. పాపం అప్పటిదాకా తమతోనే ఉన్న ఆ పసికందు చేతిలో నుంచి జారి పడిపోయి డ్రైనేజీలో కొట్టుకుపోయింది. అప్పటిదాకా తమతో ఉన్న ఆ పాప.. ఒక్కసారిగా అలా జరిగే సరికి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Uttar Pradesh: ఒంటిరిగా ఉన్న మహిళ ఇంట్లోకి దూరిన యువకులు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్..

చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఘటన బుధవారం థానేలోని ఠాకుర్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు అంబర్ నాథ్ లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా.. వర్షం కారణంగా రైలును ఠాకుర్లీ వద్ద నిలిపివేశారు. అయితే రైలు ఆగిందని దిగి.. రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు వారు వెళ్తుండగా చేతిలో నుంచి జారీ నాలుగు నెలల పసికందు డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలా డ్రైనేజీలో పడ్డ పసికందును చూడటమే తప్ప.. కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వరద బీభత్సంగా ప్రవహిస్తుంది కనుక. దాంతో ఆ తల్లిదండ్రులు తమ పాప లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.