NTV Telugu Site icon

Terrorists: అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక వాసులుగా గుర్తింపు..

Isis

Isis

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా.. వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రస్దీన్‌లుగా గుర్తించారు.

Shade Canopies : వాహనదారులకు వేడి నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్ క్యానోపీలు

ఈ నలుగురు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు తొలుత కొలంబో నుంచి చెన్నై చేరుకున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూలాల ప్రకారం.. వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో తమ పాకిస్థానీ హ్యాండ్లర్ల నుండి సందేశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) వారు పట్టుకున్నారు. ఈ క్రమంలో.. వారి నుంచి కొన్ని పాక్‌ తయారీ ఆయుధాలు కూడా లభించాయి.

Tirumala: అలిపిరి నడకదారిలో చిరుతల సంచారం.. భయంతో కేకలు వేసిన భక్తులు

ఇదిలా ఉంటే.. అంతకుముందు ఏప్రిల్‌లో గుజరాత్ ఏటిఎస్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషిద్ధ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, రాజస్థాన్‌లలో ‘మియావ్ మియావ్’గా ప్రసిద్ధి చెందిన నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్న మూడు ల్యాబ్‌లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్టు చేసింది.