అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా.. వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రస్దీన్‌లుగా గుర్తించారు.