శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. అందుకు కారణం.. వాతావరణం అనుకూలించకపోవడం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా అక్కడికి వెళ్లే విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు. ఈ క్రమంలో.. సింగపూర్- చెన్నై, చెన్నై-సింగపూర్, లండన్- చెన్నై, ముంబయి-చెన్నై విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు.
Read Also: MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్ తో అందుబాటులోకి ఎంజీ ఆస్టర్.. దాని ధర ఎంతో తెలుసా ?
ఉదయం 7 గంటల నుండి చెన్నైలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ క్రమంలో చాలా విమానాలను ఇతర ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు అధికారులు. ఈ క్రమంలో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చెన్నై విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో విమానం ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో బెంగళూరు ఎయిర్ పోర్టుకు మళ్లించారు. మరోవైపు.. పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉందని, రన్‌వేను చూడటం కష్టమవుతుందని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను దారి మళ్లించామని చెబుతున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అధికారులు విచారం వ్యక్తం చేశారు.
Read Also: Delhi Election Results: మోడీ.. ఓ అభ్యర్థి కాళ్లు మొక్కారు.. అతడి పరిస్థితి ఏంటంటే..!