Muharram: మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం మొహర్రం ఊరేగింపు నిర్వహిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది గాయాల పాలయ్యారు.
Also Read: TamilNadu Fire Accident: బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికిపైగా గాయాలు
11,000కేవీ హై-వోల్టేజ్ టెన్షన్ వైర్‌ను తాకడంతో ఈ ఘటన జరిగింది. తాకిన అనంతరం పేలుడు కూడా సంభవించింది. ఈ ఘటన జరిగిన తర్వాత గాయపడిన వారందరినీ వెంటనే బొకారో థర్మల్ డీవీసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 13 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి.