తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. లారీని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.