NTV Telugu Site icon

Noida Encounter: నోయిడాలో కాల్పుల మోత.. ఇద్దరు నేరస్తులపై ఎన్‌కౌంటర్

Noida

Noida

నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో.. ఆ సమయంలో ఓ కారు వచ్చింది. ఆ కారును ఆపమని పోలీసులు వారికి చెప్పగా.. అందులో ఉన్న వాళ్లు కారు ఆపలేదు. అంతేకాకుండా.. కారులో కూర్చున్న వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు.

Read Also: Tollywood : టాలీవుడ్ టాప్ -5 బుల్లెట్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే

అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్దేశ్ కతేరియా తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులపై కాల్పులు జరిపినందుకు పోలీసులు కూడా కారులో ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో.. ఇద్దరు దుండగులు దీపక్ కుమార్, కనోజ్ అలియాస్ షాకాకు గాయాలయ్యాయి. అనంతరం.. పోలీసులు కారును వెంబడించి సచిన్, అజిత్ అనే మరో ఇద్దరు నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరొక దుండగుడు తప్పించుకున్నాడు. తప్పించుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు.

Read Also: Nagarjuna: ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..

కాగా.. ఆగస్ట్ 11న మోహియాపూర్ గ్రామంలోని ఓ రైతు ఇంటిపై దాడి చేసి రూ.1.21 లక్షల నగదు దోచుకున్నారని దుండగుల విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే.. దుండగుల నుంచి నగదు, ఒక పిస్టల్, మూడు తుపాకులు, కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారి కారును కూడా సీజ్ చేశారు. అనేక దోపిడీలకు పాల్పడినట్లు నేరస్థులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.