Site icon NTV Telugu

TSPSC Paper Leak : పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ ముమ్మరం

Tspsc Paper Leak

Tspsc Paper Leak

ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 9 మంది నిందితులను చంచల్ గూడా జైల్లో నిన్న రెండవ రోజు సిట్ ఏడు గంటలపాటు విచారించింది. అయితే.. నేడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుల మూడో రోజు కస్టడీ విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ లో విచారణ ప్రారంభం కానుంది. అయితే.. సీసీఎస్ నుండి సిట్ కు మరికొద్ది సేపట్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులను తీసుకురానున్నారు. రెండవ రోజు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన సిట్ దర్యాప్తు బృందం.

Also Read : Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 పరీక్ష పేపర్ ని లీక్ చేసినట్లు గుర్తించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ని ఎవరెవరికి ఇచ్చాడనే కోణం లో విచారణ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసారని గుర్తించింది సిట్‌ దర్యాప్తు బృందం. దీంతో.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్‌ను సిట్ తీస్తోంది. అక్టోబర్ లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఎవరెవరితో చాటింగ్ చేశారనే వివరాలను సిట్‌ రాబడుతోంది. ఎవరెవరితో కాల్స్ మాట్లాడారో లిస్ట్ ఆధారంగా సిట్ విచారణ చేపట్టనున్నారు. అంతేకాకుండా.. అక్టోబర్ లో వీరిద్దరి బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పై సిట్ అరా తీస్తోంది. గ్రూప్ 1 పేపర్ తీసుకున్న వారిని గుర్తించి, వారిపైన కేసులు నమోదు చేయనుంది సిట్.

Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. అదే లక్ష్యమంటూ ఈ-మెయిల్

Exit mobile version