Himachal Pradesh: హిమాచల్‌లో వర్షాల విధ్వంసంతో 381 మంది మృత్యువాత.. రూ.8642 కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వర్షాన్నే కాదు విపత్తును కూడా తెచ్చిపెట్టాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 381 మంది వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ సంఘటనలలో 360 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 38 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.8642.83 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో 2, 446 ఇళ్లు పూర్తిగా.. 10, 648 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు 312 దుకాణాలు, 5 వేల 517 పశువుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. జూన్ 24 నుండి, రాష్ట్రంలో 161 కొండచరియలు, 72 ఆకస్మిక వరద సంఘటనలు నమోదయ్యాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలో గరిష్ఠంగా రూ.2927.01 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
Read Also: Mamata Banerjee: కేంద్రం గ్యాస్ ధరను తగ్గించడంపై విసుర్లు.. కారణాలివేనన్న దీదీ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వర్షాల కారణంగా సిమ్లా జిల్లాలో వివిధ సంఘటనల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. సిమ్లాలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా బిలాస్‌పూర్‌లో 15, చంబాలో 43, హమీర్‌పూర్‌లో 17, కాంగ్రాలో 29, కిన్నౌర్‌లో 13, కులులో 48, లాహౌల్ స్పితిలో 5, మండిలో 43, సిర్మౌర్‌లో 25, సోలన్‌లో 36, ఉనాలో 381 మంది మరణించారు. ఇప్పటివరకు కులు జిల్లాలో గరిష్టంగా 19 మంది గల్లంతయ్యారు. ఇది కాకుండా మండిలో 9 మంది, సిమ్లాలో నలుగురు, కిన్నౌర్‌లో ఇద్దరు, లాహౌల్ స్పితిలో ఒకరు గల్లంతయ్యారు.
Read Also: Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ నష్టం రూ.12,000 కోట్లకు మించి ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. విపత్తు బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఈ రాష్ట్ర విపత్తు ప్రకటించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కేంద్రం వైపు పడింది. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంపై 75 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు విపత్తు కారణంగా హిమాచల్‌పై అదనపు భారం పడింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!