Site icon NTV Telugu

Himachal Pradesh: హిమాచల్‌లో వర్షాల విధ్వంసంతో 381 మంది మృత్యువాత.. రూ.8642 కోట్ల నష్టం

Himachal

Himachal

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వర్షాన్నే కాదు విపత్తును కూడా తెచ్చిపెట్టాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 381 మంది వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ సంఘటనలలో 360 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 38 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.8642.83 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో 2, 446 ఇళ్లు పూర్తిగా.. 10, 648 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు 312 దుకాణాలు, 5 వేల 517 పశువుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. జూన్ 24 నుండి, రాష్ట్రంలో 161 కొండచరియలు, 72 ఆకస్మిక వరద సంఘటనలు నమోదయ్యాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలో గరిష్ఠంగా రూ.2927.01 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

Read Also: Mamata Banerjee: కేంద్రం గ్యాస్ ధరను తగ్గించడంపై విసుర్లు.. కారణాలివేనన్న దీదీ

వర్షాల కారణంగా సిమ్లా జిల్లాలో వివిధ సంఘటనల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. సిమ్లాలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా బిలాస్‌పూర్‌లో 15, చంబాలో 43, హమీర్‌పూర్‌లో 17, కాంగ్రాలో 29, కిన్నౌర్‌లో 13, కులులో 48, లాహౌల్ స్పితిలో 5, మండిలో 43, సిర్మౌర్‌లో 25, సోలన్‌లో 36, ఉనాలో 381 మంది మరణించారు. ఇప్పటివరకు కులు జిల్లాలో గరిష్టంగా 19 మంది గల్లంతయ్యారు. ఇది కాకుండా మండిలో 9 మంది, సిమ్లాలో నలుగురు, కిన్నౌర్‌లో ఇద్దరు, లాహౌల్ స్పితిలో ఒకరు గల్లంతయ్యారు.

Read Also: Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం

ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ నష్టం రూ.12,000 కోట్లకు మించి ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. విపత్తు బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఈ రాష్ట్ర విపత్తు ప్రకటించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కేంద్రం వైపు పడింది. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంపై 75 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు విపత్తు కారణంగా హిమాచల్‌పై అదనపు భారం పడింది.

Exit mobile version