Food Poison: మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం 36 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని ఒక అధికారి తెలిపారు. వారందరినీ ఆసుపత్రికి తరలించామని, అక్కడ 35 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, ఒకరిని పరిశీలనలో ఉంచామని తెలిపారు.వాన్‌లెస్‌వాడి హైస్కూల్‌లో 5, 7వ తరగతి చదువుతున్న పిల్లలకు స్వయం సహాయక బృందం నడుపుతున్న సెంట్రల్ కిచెన్‌లో వండిన అన్నం, పప్పు తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురైనట్లు ఆయన చెప్పారు.
Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో ఫిర్యాదు చేశారని విద్యాశాఖ అధికారి మోహన్ గైక్వాడ్ వెల్లడించారు. వారిలో చాలామంది వాంతులు చేసుకున్నారు. ఒక పిల్లవాడు కడుపు నొప్పితో ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ కిచెన్ నుంచి ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ విషయంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారని అని మోహన్ గైక్వాడ్ చెప్పారు.