Site icon NTV Telugu

Airports: ప్రయాణికులకు అలర్ట్.. 32 విమానాశ్రయాలు రీఓపెన్

Flight

Flight

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, భారత్ తన గగనతలాన్ని పూర్తిగా తెరిచింది. అనేక విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. దేశంలోని 32 విమానాశ్రయాలను తక్షణమే పౌర విమానాల కోసం తెరవాలని ఆదేశించారు. మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేయాలని భావించినప్పటికి పరిస్థితులు చక్కబడడంతో వీటిని తక్షణమే ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Also Read:DRDO : భారత్-పాక్‌ యుద్ధంలో హైదరాబాద్‌ డీఆర్‌డీవో కీలక పాత్ర

32 విమానాశ్రయాలకు జారీ చేయబడిన NOTAMలు (ఎయిర్‌మెన్‌కు నోటీసు) రద్దు చేయబడ్డాయి. ఈ 32 విమానాశ్రయాల జాబితాలో చండీగఢ్ విమానాశ్రయం పేరు కూడా ఉంది. సమాచారం ప్రకారం, చండీగఢ్ తో సహా 32 విమానాశ్రయాలు ఇప్పుడు పౌర విమానాల కోసం రీఓపెన్ అయ్యాయి. అయితే, ఫ్లైట్ టైమింగ్స్, ఉన్నత స్థాయి తనిఖీల కారణంగా, విమానం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read:Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సీఎం!

మే 8, 2025న, పాకిస్తాన్ డ్రోన్ దాడుల తర్వాత, దేశంలోని ముఖ్యమైన విమానాశ్రయాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అమృత్ సర్, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, జైసల్మేర్, జోధ్‌పూర్ సహా అనేక విమానాశ్రయాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు AAI 32 విమానాశ్రయాలను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. వివిధ విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరి జారీ చేశాయి.

Exit mobile version