NTV Telugu Site icon

Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు. ‘‘బీజేపీకి, ఈ మదర్సాలను నిర్వహిస్తున్న వ్యక్తులకు మధ్య సమావేశం జరిగింది. మరో 300 మదర్సాలు మూతపడతాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అస్సాం పోలీసులు, క్వామీ సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఇది జరిగింది” అని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేస్తున్నట్లు మార్చిలో సీఎం హిమంత ప్రకటించారు.

Read Also: Titanic Ship: సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ఇలా ఉందా.. శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి

మాకు మదర్సాలు వద్దు.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కావాలని.. కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని తాను భావిస్తున్నట్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని బెలగావిలో బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో ప్రసంగిస్తూ హిమంత బిస్వా శర్మ అన్నారు. హిమంత బిస్వా శర్మ 2020లో అస్సాంలో ఒక వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ మదర్సాలు సాధారణ విద్య అందించే “సాధారణ పాఠశాలలు”గా మార్చబడతాయి. జనవరి 2023 నాటికి, రాష్ట్రంలో 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. 1934లో అస్సాం విద్యా పాఠ్యాంశాల్లో మదర్సా విద్య ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో రాష్ట్ర మదర్సా బోర్డు కూడా సృష్టించబడింది.