NTV Telugu Site icon

Accident: ఆటో బోల్తా.. 30 మంది కూలీలకు తీవ్రగాయాలు

Accident

Accident

Auto Accident: పరిమితికి మించి ప్రయాణం.. మితిమీరిన వేగం.. ప్రమాదానికి కారణమైంది. పొలానికి వెళ్లి తిరిగివస్తున్న కూలీలను గాయాల పాలు చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో టైరు పగిలి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆలూరు ఆస్పత్రికి తరలించారు.

Read Also: Viral Video : కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతున్నారా? ఇది చూస్తే జన్మలో తాగరు..

శుక్రవారం చిప్పగిరి మండలంలో 30 మంది కూలీలు ట్రాలీ ఆటోలో కూలీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆలూరు మండలం వులేబీడువాసులుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తృటిలో ప్రమాదం తప్పిందని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.