Site icon NTV Telugu

Telangana BJP: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..

Bjp

Bjp

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ మండిపడుతోంది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ దాని ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Bhadradri Kothagudem: పిడుగుపాటుకు ఇద్దరు బలి.. మరో ముగ్గురికి గాయాలు

రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నేతలు అంటున్నారు. రైతు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న ఇందిరాపార్కు దగ్గర 24 గంటల దీక్ష బీజేపీ చేపట్టనుంది. ఈ దీక్ష అక్టోబర్ 1న ముగియనుంది.

Read Also: Bihar: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియోలు వైరల్

Exit mobile version