NTV Telugu Site icon

Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి 30 కుటుంబాలు..

Kakarla

Kakarla

వరికుంటపాడు మండలం పరిధిలోని కడియం పాడు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంతె ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై ఆయనకు అండగా నిలిచేందుకు తాము టీడీపీలో చేరమన్నారు. నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు అమోఘం.. వీరిద్దరి గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

Read Also: Thummala Nageswara Rao: గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం..

ఇక, వరికుంటపాడు మండలం గొల్లపల్లి, పాపన్న గారి పల్లి, మహందాపురం, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ మండల నాయకత్వంలో వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంచుతూ.. కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఇక, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్, నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓటు వేసి వారిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్ధించారు.

Read Also: Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!

ఈ సందర్భంగా కాకర్ల ప్రవీణ మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న, ఉదయగిరిలో మార్పు రావాలన్నా, మనకు పెద్దదిక్కు కావాలన్నా తెలుగుదేశం గెలవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. నెల్లూరు జిల్లా అగ్రగామిగా నిలవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయం చేకూర్చాలని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు తీసుకు రావాలని కాకర్ల ప్రవీణ చేతులు జోడించి నమస్కారం చేస్తూ వేడుకున్నారు.