NTV Telugu Site icon

Uttarpradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

Building

Building

3 Store Building Collapsed In Uttarpradesh: ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగింది. అనుకోకుండా భవనం కుప్పకూలి పోవడంతో చుట్టుపక్కల వారు బిల్డింగ్ లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు భవనంలో ఉండిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్నారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.

Also Read: New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బారాబంకీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఓ మూడంతస్తుల భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని,  వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ( ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ( ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాక చర్యలు అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు శిధిలాల కింద చిక్కుకున్న అ12 మందిని బయటకు తీశామని తెలిపారు. మరో ముగ్గురు లేదా నలుగురు శిధిలాల కింద ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనలో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని ఎస్పీ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. భవనం ఒక్కసారిగా కుప్ప కూలడంతో అక్కడ అంతా భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఉంది. దీనిని చూసిన పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కూలిపోయిందో వివరాలు తెలియాల్సి ఉంది. పాత భవనం కావడంతోనే  కుప్ప కూలిందా లేదా ఏదైనా కారణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఒకవేళ పాత భవనం అవడం కారణంగానే ఈ సంఘటన జరిగి ఉంటే బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Show comments