NTV Telugu Site icon

Electricity Bill: పూరి గుడిసెకు రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు.. షాక్‌లో కుటుంబ సభ్యులు!

Electricity Bill

Electricity Bill

Auto driver gets power bill of Rs 3,31,951 lakh in AP: ఓ సాధారణ మధ్య తరగతి చెందిన ఇంట్లో 2-3 లైట్స్, ఓ ఫ్యాన్ ఉంటాయి. నెలకు విద్యుత్తు బిల్లు రూ. 150 నుంచి 200 వస్తుంది. ఎండాకాలంలో మహా అయితే ఇంకో రూ. 100 ఎక్కువ వస్తుంది. మొత్తంగా విద్యుత్తు బిల్లు రూ. 300 మించదు. అయితే ఓ ఆటో డ్రైవర్‌ ఇంటికి ఏకంగా రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎస్‌ రాయవరం మండలంలో చోటుచేసుకుంది.

ఎస్‌ రాయవరం మండలం గోకులపాడులోని దళిత కాలనీలో ఆటో డ్రైవర్‌ రాజుబాబు నివాసం ఉంటున్నాడు. అతడు ఉండేది పూరి గుడిసెలో. రెండు రోజుల క్రితం (జులై 8)న రాజుబాబు ఇంటికి ఏకంగా రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇంత బిల్లు రావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తమకు ఇంత బిల్లు ఎలా వచ్చిందో అని రాజుబాబు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Harry Brook Record: ఇంగ్లండ్‌ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్‌!

రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు ఎలా వచ్చింది అని రాజుబాబు కుటుంబ సభ్యులు విద్యుత్తు సిబ్బందిని ప్రశ్నింశారు. సాంకేతిక సమస్య వల్ల బిల్లు అంతమొత్తం వచ్చినట్లు వారు గుర్తించారు. బిల్లును సరిచేసి.. రూ. 155 బిల్లుని రాజుబాబుకు అందజేశారు. సాంకేతిక సమస్య ఎలా వచ్చిందో అధికారులు వివరించారు. ఈ విషయంపై కొరుప్రోలు సెక్షన్‌ ఏఈ గోపి మాట్లాడుతూ.. వినియోగదారుడు రాజుబాబుకు ఈ నెల రూ. 155 బిల్లు వచ్చిందని, ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

ఇలాంటి ఘటనే గతేడాది కూడా చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 7,02,825 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని చాతకొండ హమాలీ కాలనీకి చెందిన సంపత్ మాడిశెట్టికి ఈ బిల్లు వచ్చింది. మూడు ట్యూబ్ లైట్లు, ఒక కూలర్, ఒక రిఫ్రిజిరేటర్ మరియు రెండు ఫ్యాన్స్ ఉన్న ఆ ఇంటికి సగటు కరెంటు బిల్లు రూ. 500. అధికారులు బిల్లును సరిచేసి అతనికి రూ. 675 బిల్లు ఇచ్చారు.

Also Read: Gold Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత ఉందంటే?

Show comments