Fire Accident: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని హోటల్ గెలాక్సీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఉన్న హోటల్‌లోని రెండో అంతస్తులో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి.
Read Also: Viral Video: వీడియో.. కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క
హోటల్ నుంచి ఎనిమిది మందిని రక్షించి కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.మంటలను అదుపులోకి తీసుకొచ్చి భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలు, అనేక నీటి ట్యాంకర్లను హోటల్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.