Maharashtra: ముంబయి శివార్లలోని ప్రముఖ నివాస ప్రాంతమైన విరార్‌లోని గోకుల్ టౌన్‌షిప్‌లోని ఓ రెస్టారెంట్ అండ్ బార్ లో ఓ కొంతమంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. అయితే, విషయం తెలుసుకున్నా పోలీసులు విచారించగా.. బార్‌లో ఉన్న మరికొందరు కస్టమర్‌లతో వారు వాగ్వాదానికి దిగాడంతో.. వారిని వెళ్లిపోవాలని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పినట్లు తేలింది.
Read Also: MP Navneet Kaur: కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు..
కాగా, మద్యం మత్తులో ఉన్న మహిళలను ప్రశ్నించగా వారు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పాటు దుర్భాషలాడారు. అలాగే, ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చేతిని కొరికి, ఆమె యూనిఫాం చింపేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్‌తో దాడి చేసి మణికట్టుపై కొరికినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక అమ్మాయి తన స్నేహితులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇక, మద్యం మత్తులో ఉన్న కావ్య, అశ్విని, పూనమ్ అనే ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Papa ki pariyaan. Palghar edition. 🤦🏻♂️ pic.twitter.com/U6M42TfqpR
— Prashant Kumar (@scribe_prashant) May 10, 2024
PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu