NTV Telugu Site icon

Carona : మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా.. మహారాష్ట్రలో ముగ్గురి మృతి

Carona : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 562 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి వల్ల మరో ముగ్గురు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ముంబైలోనే 172 పైగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాక్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,488కి చేరుకుంది. ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబయి జిల్లాలో 1,070 కొవిడ్ పాజిటివ్ కేసులు, పూణే జిల్లాలో 766, థానే జిల్లాలో 616 కేసులు నమోదైనాయి.

Read Also: Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు

గతంలోనూ ముంబయి కేంద్రంగా కరోనా కేసుల వ్యాప్తి మొదలై దేశవ్యాప్తంగా ప్రబలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పాజిటివ్ కొవిడ్ రేటు శాతం 9.4కు చేరింది. గత 24 గంటల్లో 395 మంది కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా స్ట్రెయిన్ ను గుర్తించడానికి జన్యుపరీక్షలపై దృష్టి సారించాలని ఫోర్టిస్ హాస్పిటల్ ములుండ్ క్రిటికల్ కేర్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వైశాలి సోలావో సూచించారు. మహారాష్ట్రలో కొవిడ్ -19 కేసుల్లో తీవ్ర పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ఎస్‌ఎల్ రహేజా హాస్పిటల్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సంజిత్ శశీధరన్ అన్నారు.విమానాశ్రయాలు, దేశంలోకి ప్రవేశించే ఇతర ప్రదేశాల్లో కరోనా పరీక్షల శాతాన్ని పెంచాలని వైద్యులు సూచించారు.

Read Also: Text To Video: ఇది కావాలని చెప్తే చాలు.. క్షణాల్లో వీడియో రెడీ