Site icon NTV Telugu

Gannavaram Airport: గన్నవరంలో మూడు విమానాల అత్యవసర ల్యాండింగ్‌

Gannavaram

Gannavaram

Gannavaram Airport: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో మూడు విమానాలు అత్యవసరంగ ల్యాండ్‌ చేశారు.. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవటంతో మూడు విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు తరలించి ల్యాండింగ్‌ చేశారు.. చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌, గోవా నుంచి హైదరాబాద్‌, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌ విమానాలు రావాల్సి ఉంది.. అయితే, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు.. దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్‌ కావడం సమస్యగా మారింది.. దీంతో.. ఆ మూడు విమానాలను సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవరసరంగా ల్యాండ్‌ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.. ఇక, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత.. ఆ ప్రయాణికులను తిరిగి అదే విమానాల్లో హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also: Delhi Airport: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..

Exit mobile version