NTV Telugu Site icon

Stadium Collapsed : ఈజిప్టులో కూలిన స్టేడియం.. అభిమానుల మధ్య తొక్కిసలాట

Stadium

Stadium

Stadium Collapsed : ఈజిప్టు రాజధాని కైరోలో ఘోరం జరిగింది. బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు నిలుచున్న స్టేడియం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. అల్ అహ్లీ మరియు ఇత్తిహాద్ మధ్య జరిగిన సూపర్ కప్ మ్యాచ్ సందర్భంగా, స్టాండ్స్‌లో తొక్కిసలాట వల్ల సీట్లలో కొంత భాగం ప్రేక్షకులపై పడిందని అధికారులు తెలిపారు.

Read Also: Tollywood: టాలీవుడ్‌ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత

ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధినేత హసన్ ముస్తఫా పేరిట ఉన్న మల్టీ పర్పస్ ఎరీనాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మెటల్ స్టాండ్ ముక్కలుగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్షతగాత్రులలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హోసామ్ అబ్దుల్ గఫార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎతిహాద్ మద్దతుదారుల తొక్కిసలాటతో స్టాండ్ కూలిపోయిందని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫౌజీ స్థానిక టెలివిజన్ ఛానెల్‌తో అన్నారు.

Read Also: Chiranjeevi : తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి

2021 ప్రపంచ పురుషుల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఈజిప్ట్ ఆతిథ్యం ఇవ్వడానికి మూడు సంవత్సరాల క్రితం అరేనా ప్రారంభించబడింది. ఈ ఘటనతో కైరోలోని హసన్ ముస్తఫా స్పోర్ట్స్ హాల్‌లో జరగాల్సిన గేమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈలోగా, ఈజిప్టులో క్రీడా కార్యక్రమాల సమయంలో ప్రమాదాలు అసాధారణం కాదు. 2012లో తీరప్రాంత నగరమైన పోర్ట్ సెడ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో 70 మందికి పైగా మరణించారు.