NTV Telugu Site icon

Himachal Pradesh: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఎన్నికల వేళ బీజేపీలోకి 26 మంది కీలక నేతలు

Congress Leaders

Congress Leaders

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులకు ఉండగా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ ఖండ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర సభ్యులు సోమవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 26 మంది నేతలు రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరారు. పోలింగ్‌కు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

Weddings: మొదలైన పెళ్లిళ్ల సీజన్‌.. 40 రోజుల్లో 32లక్షల వివాహాలు.. లక్షల కోట్ల వ్యాపారం

ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి సుధాన్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బీజేపీలో చేరిన కార్యకర్తలందరికీ ఘనస్వాగతం పలికారు. బీజేపీ చారిత్రాత్మక విజయానికి అందరం కలిసికట్టుగా పని చేద్దామని అన్నారు. అంతకుముందు హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విజయంపై పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పాలనపై జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. క్షేత్రస్థాయిలో ఆయన మంచి విధానాలను అమలు చేశారని అన్నారు. హిమాచల్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.