NTV Telugu Site icon

Telangana Government : జీవో నెం.4 ఎక్సైజ్‌, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు

Liquor

Liquor

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసి ఉంచుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే.. ఇందుకోసం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌ట్రా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టిన వారికి సంవత్సరం పొడవునా 24/7 దుకాణం తెరిచే ఉంచుకోవచ్చని… కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని దుకాణాలు మరియు సంస్థలు 24×7 తెరిచి ఉండకూడదని, రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన వారు మాత్రమే తెరిచి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) ద్వారా రాష్ట్రంలో 24×7 వ్యాపారం కోసం తెరవబడే దుకాణాలు మరియు సంస్థలకు మినహాయింపు మంజూరు చేయబడింది. అయితే, అనుమతికి పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జీవో నెం.4 ఎక్సైజ్‌, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Also Read : MP Nama Nageswara Rao : ప్రధాని పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం నిధులతో అభివృద్ధి అనేది భూటకం

‘ఇప్పటికే దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబాయ్ , బెంగుళూరు లలో 24 / 7 గంటలు షాపులు తెరిచి ఉంచే నిబంధనలు అమలులో ఉన్నాయని, జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 ప్రకారం జారీచేసిన ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆక్ట్, 1988 పరిధి కి లోబడే అమలు అవుతాయి. ఈ ఉత్తర్వులు అన్ని షాప్ లకు ఆటోమేటిక్ గా వర్తించదు. 24 /7 గంటలు తెరిచి ఉంచాలనుకునే షాపులు ప్రత్యేక నిబంధనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకనుగుణంగా తగు అనుమతులు పొందిన అనంతరమే తమ షాప్ లను 24 /7 గంటలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ జీవో 4 అన్ని షాపులకు వర్తించవు. జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 తేదీ. 4 .4 .2023 ఉత్తర్వులు ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ కు వర్తించవు. ఎక్సయిజ్ చట్టాలు, నిబంధనల ననుసరించి టీఎస్ బిసిఎల్, ఐ.ఎం.ఎఫ్.ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రివరీలు, A4 షాపులు, 2B బార్లు కు ప్రత్యేక బిజినెస్ సమయం ప్రకారం మాత్రమే తెరచి ఉంటాయి.’ అని.. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనను విడుదల చేశారు.

Also Read : Phone Call: ఆస్పత్రికి ఫోన్ చేసింది… రెండు లక్షలు పోగొట్టుకుంది