NTV Telugu Site icon

World: ఈ ప్రపంచంలో ఎంతమందికి కరెంట్, వంటగ్యాస్‌ లేదో తెలుసా..?

Gas

Gas

ప్రస్తుత ఈ ఆధునిక యుగంలోనూ విద్యుత్‌ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్‌ అందుబాటులో లేనివారు ఎవరైనా ఉంటారా అని మీరు అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి.

Read Also: Minister KTR: నేడు ములుగులో కేటీఆర్‌ పర్యటన.. 5 మోడల్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన

ఈ ప్రపంచంలోనే దాదాపు 230 కోట్ల మంది వంట చెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని ఈ ఐదు సంస్థలు వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేదని తెలియజేశాయి. ఎంతో టెక్నాలజీతో ప్రపంచం ముందుకు సాగుతుంటే మరి కొన్ని ప్రాంతాలు మాత్రం కనీసం కరెంట్, వంట గ్యాస్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Wtc Final: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. మరి ట్రోఫీ ఎవరిదో..?

1. 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్‌ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది అని ఈ ఐదు సంస్థలు తెలిపాయి.
2. 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్‌ సౌకర్యం ఉండగా.. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది.
3. కరెంటు సౌకర్యం లేనివారిలో 56.7 కోట్లు మంది (80 శాతం) సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో నివసిస్తున్నారు.
4. ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
5. వంట గ్యాస్‌ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి.