Site icon NTV Telugu

Physical Harassment: సిమ్లాలో పంజాబ్‌ మోడల్‌పై అత్యాచారం

Physical Harassment

Physical Harassment

Physical Harassment: రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తీస్తానన్న సాకుతో నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Indian-Origin Family: యూఎస్‌లో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద మృతి

పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో, తాను డిసెంబర్ 22న సిమ్లాకు వచ్చి రాత్రి సిమ్లాలోని ఓ హోటల్‌లో బస చేశానని, నిందితులు తనను వేధించారని బాధితురాలు వెల్లడించింది. 23 ఏళ్ల బాధితురాలు బుధవారం న్యూ సిమ్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు సిమ్లా ఏఎస్పీ సునీల్ నేగి తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version