Chittoor Road Accident: చిత్తూరులో ప్రైవేటు బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Road Accident Today: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పింది. అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. సికింద్రాబాద్కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్ (35)కు తీవ్రంగా గాయాలయ్యాయి.
Also Read
Also Read: Kartik Tyagi Bowling: 153 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతి.. నొప్పితో విలవిల్లాడిన పీయూష్ చావ్లా!
సమాచారం అందుకున్న గుడిపాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను గుడిపాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!