Site icon NTV Telugu

Barsana Temple: ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి.. రైలింగ్ కూలి 22 మందికి గాయాలు

Railing Collapse

Railing Collapse

Barsana Temple: యూపీలోని బర్సానాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం రాధారాణి ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్‌ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్సానాలోని రాధా రాణి ఆలయంలో ఆదివారం సాయంత్రం ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

Read Also: Super Foods: ప్రపంచంలో టాప్‌ 10 సూపర్‌ ఫుడ్స్‌.. హార్వర్డ్‌ ఏం చెప్పిందంటే?

ఈ వేడుకల్లో భాగంగా భక్తుల కోసం లడ్డూను పంపిణీ చేస్తుండగా.. ప్రసాదం కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలో ఆలయంలో మెట్ల రెయిలింగ్‌ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆలయంలో రద్దీని నియంత్రించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు అధికారులు వివరించారు.

Exit mobile version