Site icon NTV Telugu

CCLA: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. సీసీఎల్ ఏలో 217 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

Revanthreddy

Revanthreddy

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సీసీఎల్ ఏలో 217 పోస్టులను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.

Exit mobile version