Site icon NTV Telugu

Sexual Assault: భర్తను హత్య చేసి భార్యపై లైంగిక దాడి..

Chasttisgar

Chasttisgar

ఛత్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబికాపూర్‌లో నివసించే ఓ మహిళపై .. ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు తన భర్తను హత్య చేసాడు. అనంతరం ఆ రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే అతడి భార్యపై అత్యాచారం చేశాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు తెలపగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడిపై సెక్షన్ 302, 376, 506 కింద కేసులు పెట్టి జైలుకు తరలించారు.

Suicide: ఉరి వేసుకుని యువతి సూసైడ్.. హస్పటల్ దగ్గర ఉద్రిక్తత

వివరాల్లోకి వెళ్తే.. అంబికాపూర్‌కు చెందిన 42 ఏండ్ల సుఖ్‌లాల్‌ సోమవారం రాత్రి భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో తన భార్యకు పరిచయం ఉన్న కార్తీక్ కోర్వా (21) అనే వ్యక్తి వారి ఇంట్లోకి సైలంట్ గా వచ్చాడు. అంతలోనే సుఖ్‌లాల్‌ నిద్ర లేచాడు. కార్తీక్‌ను చూసిన సుఖ్‌లాల్‌.. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ కర్రతో కార్తీక్‌ సుఖ్‌లాల్‌ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సుఖ్ లాల్ మృతిచెందాడు.

Video Viral: పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు

మరోవైపు నిందితుడు అంతటితో ఆగకుండా మహిళను బెదిరించి.. రక్తం మడుగుల్లో పడి ఉన్న భర్త మృతదేహం పక్కనే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Exit mobile version