Man Fells Into Hot Rasam: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి సాంబారు గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఓ 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. బాధితుడు ఓ క్యాటరింగ్ కంపెనీలో పార్ట్ టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కళాశాల విద్యార్థిగా గుర్తించారు. గత వారం వివాహ వేడుకలో కాటరింగ్ కంపెనీ తరఫున పాల్గొన్నాడు. అతిథులకు భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Rains In India: దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు
వివాహ వేడుకకు హాజరైన అతిథులకు భోజనం వడ్డిస్తూ, అతిథులకు వడ్డించాల్సిన సాంబారు గిన్నెలో అతడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అతను స్పృహలోకి రాకుండానే ఏప్రిల్ 30న మరణించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
