NTV Telugu Site icon

America: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. 21మంది మృతి

Tornado

Tornado

America: అమెరికాలోని అర్కాన్సాస్, ఇల్లినాయిస్‌లో టోర్నడో సృష్టించిన విధ్వంసం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ తుపాను కారణంగా పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, శుక్ర, శనివారాల్లో 60కి పైగా టోర్నడోలు నమోదయ్యాయి. లిటిల్ రాక్‌లో కనీసం ఒకరు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తుఫాను ఆర్కాన్సాస్‌లోని వేన్‌లో కూడా టోర్నడో విధ్వంసం సృష్టించింది. చాలా ఇళ్లు కూలిపోయి.. శిథిలాల కింద ప్రజలు సమాధి అయ్యారు.

Read Also: Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం

ఇల్లినాయిస్‌లోని బెల్విడెరేలో శుక్రవారం రాత్రి తుఫాను కారణంగా థియేటర్ పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లో వడగళ్లు సంభవించాయి. ఓక్లహోమాలో గడ్డి మంటలు మరింత తీవ్రమయ్యాయి. దాదాపు 350,000 మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హామీ ఇచ్చారు. లిటిల్ రాక్‌లో, సుడిగాలి మొదట నగరం పశ్చిమ వైపు.. దాని పరిసరాలను తాకింది. ఇది ఒక చిన్న షాపింగ్ సెంటర్‌ను దెబ్బతీసింది. అనంతరం సుడిగాలి అర్కాన్సాస్ నదిని దాటి నార్త్ లిటిల్ రాక్ చుట్టుపక్కల నగరాల్లోకి ప్రవేశించింది. అక్కడ అది గృహాలు, వ్యాపారాలు, వాహనాలకు విస్తృత నష్టాన్ని కలిగించింది. బాప్టిస్ట్ హెల్త్ మెడికల్ సెంటర్ అధికారులు మాట్లాడుతూ తుఫానులో గాయపడిన 21 మందిని ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ 24 మంది ఆసుపత్రిలో చేరినట్లు అధికారులకు సమాచారం ఉందని, అయితే ఈ సమయంలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ట్వీట్ చేశారు.

Read Also : Girl fight with boys : అబ్బాయిలకు బుద్ధి చెప్పిన లేడీ బ్రూస్లీ

వైన్‌లోని సిటీ కౌన్సిల్ సభ్యురాలు లిసా పావెల్ కార్టర్ మాట్లాడుతూ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయని అన్నారు. తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఈ నివాసి మాట్లాడుతూ ‘1985 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. కౌంటీ మొత్తం నాకు బాగా తెలుసు. తుఫాను కారణంగా ల్యాండ్‌మార్క్‌లను గుర్తించలేక నేను షాక్ అయ్యాను’ అని అన్నారు.

Show comments