2025లో టాలీవుడ్‌కు చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూ. 500 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీకే కాదు బాలీవుడ్‌కే దిక్సూచీగా మారిన టాలీవుడ్.. హయ్యెస్ట్ కలెక్షన్స్ విషయంలో వెనుకబడిపోయింది. ఇక రీజనల్గా అడపా దడపా సినిమాలే ఫెర్ఫామెన్స్ చూపించాయి. చిన్న సినిమాలు వావ్ అనిపించాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు . దీంతో ఈ ఏడాది నిరూపించుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి చిన్న సినిమాలతో టాలీవుడ్ ప్రయాణం మొదలైంది.
Also Read : Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
జనవరి 1న సైక్ సిద్దార్థ్, వన వీర వచ్చాయి కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే కల్ట్ ఫిల్మ్ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ టైంలో కూడా కొన్ని చోట్ల మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఏడాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న.. రెండు, మూడేళ్లుగా మారుతి చెక్కిన మూవీ రాజా సాబ్ రానే వచ్చింది. జనవరి 9న రిలీజైన ఈ బొమ్మ.. నెగిటివ్ టాక్ తెచ్చుకుని చివరకు ఫ్లాప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలు పెంచిన మూవీ ఫ్లాప్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కు మారుతి టార్గెట్ అయ్యాడు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు ఎలా రప్పించాలో అనిల్ రావిపూడికి తెలుసు. సేమ్ స్ట్రాటజీని అప్లై చేసి.. వింటేజ్ చిరుతో వెంకీ మామను జత చేసి మన శంకర్ వరప్రసాద్ గారును దింపాడు. సినిమా ఊహించినట్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. బయ్యర్స్ సేవ్ అవ్వడమే కాదు లాభాలను తెచ్చిపెట్టింది. రూ. 400 కోట్లు కొల్లగొట్టి.. హయ్యెస్ట్ గ్రాసర్ రీజనల్ మూవీగా నిలిచింది.
Also Read : Exclusive : నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..
చిరంజీవి వచ్చిన మరుసటి రోజు తమ్ముడు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చేశాడు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రవితేజ గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ కలిగించింది. ఇక ఆ మరుసటి రోజే ఎనర్జటిక్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో దూసుకొచ్చాడు. హిలేరియస్ ఫన్ ఉండటంతో యూత్ బాగా కనెక్టై మూవీని హిట్ చేశారు.. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెనై, వంద కోట్లను కొల్లగొట్టి.. భారీ విజయాన్ని నమోదు చేసింది.
పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే వచ్చేశాడు శర్వానంద్. నారీ నారీ నడుమ మురారి జనవరి 14న ప్రీమియర్ ఆటతో మొదలైంది. సినిమా బాగున్నప్పటికీ.. రేసులో కాస్త వెనుక రావడం వల్ల కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లు రాబట్టాడు. శర్వానంద్ కూడా చాలా రోజుల తర్వాత ఓ హిట్ వేసుకున్నాడు. ఇక ఈ జనవరి చివరిలో వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః ఫైనల్ రిజల్ట్ తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ జనవరిలో విన్నర్‌గా నిలిచింది మన శంకర్ వర ప్రసాద్.