2025 Royal Enfield Hunter 350: కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ లో భారీ మార్పులు.. అప్డేట్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 Royal Enfield Hunter 350: రాయల్ ఎన్ఫీల్డ్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ రోడ్‌స్టర్ హంటర్ 350కి 2025లో మొదటి అప్డేట్ను ప్రకటించింది. ఈ అప్డేట్ను ‘Hunterhood Festival’లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్, ఎలక్ట్రికల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం.
Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్.!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
హంటర్ 350లో ప్రధాన మార్పు అంటే రివైజ్డ్ రియర్ సస్పెన్షన్. గత వెర్షన్ పై వచ్చిన “ఫిర్మ్ రైడ్” ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని, రాయల్ ఎన్ఫీల్డ్ లీనియర్ షాక్స్‌కి బదులుగా ప్రోగ్రెసివ్ షాక్స్ ను అమర్చింది. ఇవి ప్రయోగాత్మకంగా మెత్తగా ఉన్నట్టు కనిపించాయి. కానీ, రోడ్‌పై అసలు పనితీరు ప్రయోగాల తర్వాతే తెలుస్తుంది. ఇంకా, కొత్తగా రిడిజైన్ చేసిన సీటు మరియు హ్యాండిల్‌బార్ వచ్చాయి. సీటు షేప్ మునుపటిలాగానే ఉండగా, లోపల ఉపయోగించిన ఫోమ్ డెన్సిటీ మార్పుతో మెరుగైన కంఫర్ట్ అందించనుంది.
అలాగే హంటర్ 350లో స్లిప్, అసిస్టెంట్ క్లచ్ ను కలిపారు. ఇది J-ప్లాట్‌ఫామ్‌పై ఉండే మొదటి బైక్ కావడం విశేషం. దీని వల్ల క్లచ్ చాలా తేలికగా ఉంటుంది. సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది డ్రైవర్‌కు చాలా సహాయపడుతుంది. వీల్ మార్పుల కారణంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 150mm నుండి 160mmకి పెరిగింది. ఇది భారతీయ రోడ్లకు మరింత అనుకూలంగా మారనుంది. ఇక 2025 హంటర్ 350లో ఇప్పుడు మొత్తం 6 రంగు ఎంపికలు లభిస్తున్నాయి. ఇవి మూడు వెర్షన్లలో లభిస్తాయి. రెట్రో, డాపర్, రెబెల్ వెర్షన్లలో లభిస్తాయి. ఇందులో రెట్రో వేరియంట్ బ్లాక్ షేడ్‌తో, స్పోక్ వీల్స్‌తో వస్తుంది. డాపర్ వేరియంట్ కొత్తగా రియో వైట్ కలర్‌ను పొందింది. అలాగే రెబెల్ వేరియంట్ మ్యాట్ బ్లాక్ విత్ వైట్, గ్లోస్ రెడ్ విత్ బ్లాక్ కలర్ స్కీమ్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
Read Also: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామ్న సీఎం
ఇక హంటర్ 350కు LED హెడ్‌లైట్ ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ కేవలం డాపర్ మరియు రెబెల్ వేరియంట్లకే పరిమితం. బేస్ వేరియంట్ అయిన ఫ్యాక్టరీ వేరియంట్ మాత్రం ఇప్పటికీ హాలోజన్ లైటుతో కొనసాగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో రెట్రో వేరియంట్ రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), డాపర్ వేరియంట్ రూ.1.77 లక్షలు, రెబెల్ వేరియంట్ రూ.1.82 లక్షలుగా ఉన్నాయి. ఈ అప్డేట్లు చూస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ మరింత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హంటర్ 350ను తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..