Site icon NTV Telugu

2025 Royal Enfield Hunter 350: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ లో భారీ మార్పులు.. అప్‌డేట్లు ఇవే!

2025 Royal Enfield Hunter 350

2025 Royal Enfield Hunter 350

2025 Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ రోడ్‌స్టర్ హంటర్ 350కి 2025లో మొదటి అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ను ‘Hunterhood Festival’లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్, ఎలక్ట్రికల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం.

Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్.!

హంటర్ 350లో ప్రధాన మార్పు అంటే రివైజ్డ్ రియర్ సస్పెన్షన్. గత వెర్షన్ పై వచ్చిన “ఫిర్మ్ రైడ్” ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని, రాయల్ ఎన్‌ఫీల్డ్ లీనియర్ షాక్స్‌కి బదులుగా ప్రోగ్రెసివ్ షాక్స్ ను అమర్చింది. ఇవి ప్రయోగాత్మకంగా మెత్తగా ఉన్నట్టు కనిపించాయి. కానీ, రోడ్‌పై అసలు పనితీరు ప్రయోగాల తర్వాతే తెలుస్తుంది. ఇంకా, కొత్తగా రిడిజైన్ చేసిన సీటు మరియు హ్యాండిల్‌బార్ వచ్చాయి. సీటు షేప్ మునుపటిలాగానే ఉండగా, లోపల ఉపయోగించిన ఫోమ్ డెన్సిటీ మార్పుతో మెరుగైన కంఫర్ట్ అందించనుంది.

అలాగే హంటర్ 350లో స్లిప్, అసిస్టెంట్ క్లచ్ ను కలిపారు. ఇది J-ప్లాట్‌ఫామ్‌పై ఉండే మొదటి బైక్ కావడం విశేషం. దీని వల్ల క్లచ్ చాలా తేలికగా ఉంటుంది. సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది డ్రైవర్‌కు చాలా సహాయపడుతుంది. వీల్ మార్పుల కారణంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 150mm నుండి 160mmకి పెరిగింది. ఇది భారతీయ రోడ్లకు మరింత అనుకూలంగా మారనుంది. ఇక 2025 హంటర్ 350లో ఇప్పుడు మొత్తం 6 రంగు ఎంపికలు లభిస్తున్నాయి. ఇవి మూడు వెర్షన్లలో లభిస్తాయి. రెట్రో, డాపర్, రెబెల్ వెర్షన్లలో లభిస్తాయి. ఇందులో రెట్రో వేరియంట్ బ్లాక్ షేడ్‌తో, స్పోక్ వీల్స్‌తో వస్తుంది. డాపర్ వేరియంట్ కొత్తగా రియో వైట్ కలర్‌ను పొందింది. అలాగే రెబెల్ వేరియంట్ మ్యాట్ బ్లాక్ విత్ వైట్, గ్లోస్ రెడ్ విత్ బ్లాక్ కలర్ స్కీమ్స్‌తో అందుబాటులోకి వచ్చింది.

Read Also: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామ్న సీఎం

ఇక హంటర్ 350కు LED హెడ్లైట్ ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ కేవలం డాపర్ మరియు రెబెల్ వేరియంట్లకే పరిమితం. బేస్ వేరియంట్ అయిన ఫ్యాక్టరీ వేరియంట్ మాత్రం ఇప్పటికీ హాలోజన్ లైటుతో కొనసాగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో రెట్రో వేరియంట్ రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), డాపర్ వేరియంట్ రూ.1.77 లక్షలు, రెబెల్ వేరియంట్ రూ.1.82 లక్షలుగా ఉన్నాయి. ఈ అప్‌డేట్‌లు చూస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ మరింత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హంటర్ 350ను తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.

Exit mobile version