Site icon NTV Telugu

2025 Kia Carens Clavis: ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!

2025 Kia Carens Clavis

2025 Kia Carens Clavis

2025 Kia Carens Clavis: కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్‌లు మే 9 నుండి అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, iMT, DCT మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 6, 7 సీటర్ సెటప్‌లలో వస్తుంది.

Read Also: 2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!

కారెన్స్ క్లావిస్ 20 అటానమస్ సేఫ్టీ ఫంక్షన్లను కలిగి ఉన్న ADAS లెవల్ 2 తో అమర్చబడి ఉంది. అలాగే స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో పార్కింగ్ సెన్సార్లు, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ లాంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కియా ఇండియా తన కొత్త 2025 కారెన్స్ క్లావిస్ మోడల్‌కు సంబంధించి వేరియంట్ వారీగా ధరలను అధికారికంగా ప్రకటించింది. మరి వాటి వివరాలను ఒకసారి చూద్దామా..

Read Also: Kawasaki Versys-X 300: బండిని చూస్తేనే నడిపేయాలనిపించే కావసాకీ వర్సిస్-X 300 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇలా..!

1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 11,49,900

HTE (O) (6MT) – రూ. 12,49,900

HTK (6MT) – రూ. 13,49,900

1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (O) (6MT) – రూ. 13,39,900

HTK (6MT) – రూ. 14,39,900

HTK+ (6MT) – రూ. 15,39,900

HTK+ (O) (6MT) – రూ. 16,19,900

HTX (6MT) – రూ. 18,39,900

HTX+ (6MT) – రూ. 19,39,900

HTX (6 iMT) – రూ. 18,69,900

HTX+ (6 iMT) – రూ. 19,69,900

HTK+ (7 DCT) – రూ. 16,89,900

HTK+ (O) (7 DCT) – రూ. 17,69,900

HTX+ (7 DCT) – రూ. 21,49,900

1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు (6 సీటర్):
HTX+ (6MT) – రూ. 19,39,900

HTX+ (6 iMT) – రూ. 19,69,900

HTX+ (7 DCT) – రూ. 21,49,900

1.5L డీజిల్ వేరియంట్లు (7 సీటర్):
HTE (6MT) – రూ. 13,49,900

HTE (O) (6MT) – రూ. 14,54,900

HTK (6MT) – రూ. 15,51,900

HTK+ (6MT) – రూ. 16,49,900

HTK+ (O) (6MT) – రూ. 17,29,900

HTX (6MT) – రూ. 19,49,900

HTK+ (6AT) – రూ. 17,99,900

SUV ఎంపికలో కొత్తగా మోడల్ కోసం చూస్తున్నవారికి ఈ వేరియంట్ల ధరలు, ఎంపికలతో కియా కారెన్స్ క్లావిస్ మంచి ఎంపిక కావచ్చు.

Exit mobile version