Site icon NTV Telugu

Honda Rebel 500: కుర్రళ్లను అట్రాక్ట్ చేస్తోన్న బైక్.. హోండా కొత్త ప్రీమియం బైక్ రెబెల్ 500 విడుదల

Rebel

Rebel

హోండా కంపెనీ రిలీజ్ చేసే బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బైక్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మరో కొత్త ప్రీమియం బైక్ ను తీసుకొచ్చింది. హోండా భారతదేశంలో కొత్త బైక్ రెబెల్ 500 ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, రెట్రో లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. క్రూయిజర్ బైక్ విభాగంలో హోండా రెబెల్ 500 కోసం బుకింగ్‌లు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుంచి గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో ప్రారంభమవుతాయి.

Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా.. పోలీసులకు కీలక ఆదేశాలు

హోండా రెబెల్ 500 ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త హోండా రెబెల్ 500 చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ బైక్‌ను పోలిన లుక్‌తో వచ్చే ఈ బైక్, పాత డిజైన్, కొత్త టెక్నాలజీ మిశ్రమాన్ని చూపిస్తుంది. రెబెల్ కు అమర్చిన స్టీల్ ఫ్రేమ్ దానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్‌లో వచ్చే రెబెల్ 500లో రైడర్, పీలియన్ ఇద్దరికీ సీట్లు ఉన్నాయి. రెబెల్ 500 లోని అన్ని లైట్లు LED లతో ఉంటాయి. ఇది గుండ్రని హెడ్‌లైట్‌తో పాటు కాంపాక్ట్ రియర్ లుక్‌ను కలిగి ఉంది.

Also Read:Bengaluru: బెంగళూరును ముంచెత్తిన కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బైకులు

హోండా కొత్త రెబెల్ 500 LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది వేగం, ఇంధన స్థాయి, ఇతర ముఖ్యమైన వివరాల సమాచారాన్ని అందిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో 296 mm డిస్క్, వెనుక భాగంలో 240 mm డిస్క్ ఉన్నాయి. రెబెల్ 500 లో డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉంది. కొత్త హోండా రెబెల్ 500 471 సిసి లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్, ప్యారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 47 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 43.3 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Exit mobile version