Site icon NTV Telugu

Voters: భారత్ లో 96 వేల మంది ఓటర్లు.. 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వారే..!

Voters

Voters

లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది. 2019 నాటికి ఈ సంఖ్య 91. 20 కోట్లుగా ఉన్నట్టు ఈసీ చెప్పింది. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని ఈసీ పేర్కొనింది. వీరిలో మహిళలు 47 కోట్ల మందికి పైగా ఉన్నారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అదే విధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏళ్ల వయసు ఉన్న వారేనని వెల్లడించింది. అలాగే, ఓటర్ల జాబితాలో నమోదైన వారిలో దాదాపు 18 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

Read Also: Maratha Reservation: ముగిసిన మరాఠా రిజర్వేషన్ ఉద్యయం.. నిమ్మరసం తాగిన మనోజ్ జరంగే పాటిల్

ఇక, ఎన్నికల నిర్వహణ కోసం దేశ వ్యాప్తంగా 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్‌ సిబ్బందిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించనున్నట్లు సమాచారం. గత సంవత్సరం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం.. దేశంలో 1951లో 17. 32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఆ సంఖ్య 91. 20 కోట్లకు చేరుకుంది.. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదు అయింది.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు అయింది.

Exit mobile version