హీరో కంపెనీ నుంచి ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్‌తో స్టీల్త్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్. 2024 Xtreme 160R బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఫీచర్ మొదటిసారిగా:
2024 Xtreme 160R మోడల్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డ్రాగ్ రేస్ టైమర్‌ను చేర్చారు. ఇది ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తున్నారు. పిలియన్‌కి మరింత సౌకర్యంగా ఉండేలా సీటు అప్‌డేట్ చేశారు. అలాగే.. వెనుక గ్రిప్ స్పాన్ విభాగంలో సీటు ఎత్తు కూడా తగ్గించారు. వెనుకాల.. న్యూ మోడల్ హీరో లైనప్‌ని సూచించే “H” గుర్తుతో కొత్త టెయిల్ ల్యాంప్ ఉంది.
ఇంజిన్ పవర్, గేర్‌బాక్స్:
హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ బైక్ లో అదే 163.2 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 rpm వద్ద 14.8 bhp శక్తిని, 6,500 rpm వద్ద 14 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటాయి.
ఫీచర్లు:
Hero Extreme 160R అడ్జె్స్ట్ బ్రైట్‌నెస్‌తో విలోమ LCD కన్సోల్‌తో వస్తుంది. ఈ బైక్ కు వెనుక పెద్ద టైర్, ఒకే ఛానల్ ABS, ఆల్-LED లైటింగ్‌ను కలిగి ఉంది. అలాగే.. మొబైల్ ఛార్జ్ చేయడానికి బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జర్ కూడా ఉన్నాయి.
బ్రేకింగ్, సస్పెన్షన్:
ఈ బైక్‌లో ట్యూబులర్ అండర్‌బోన్ డైమండ్ టైప్ ఫ్రేమ్‌ను ఉపయోగించింది. సస్పెన్షన్ గురించి చెప్పాలంటే.. ఇది ముందు వైపున 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపున 7-దశల సర్దుబాటు మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం.. ముందు భాగంలో 276 mm పెటల్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 220 mm పెటల్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది.