Dussehra Special Trains: విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Special Trains: దసరా పండగ నేపథ్యంలో జనాలు సొంతూళ్ల బాట పట్టారు. నేడు బతుకమ్మ, రేపు దసరా నేపథ్యంలో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరు-సంత్రాగచి రైలు (06285/06286) అక్టోబర్ 21న బెంగళూరులో తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.10 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 23న సంత్రాగచిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. కృష్ణరాజపురం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
Also Read
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
చెన్నై-భువనేశ్వర్ రైలు (06073/06074) అక్టోబర్ 23, 24, 30, 31.. నవంబరు 6, 7 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో భువనశ్వర్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
Also Read: Israel Palestine War: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు.. హిందూ డాక్టర్ ఉద్యోగం పోయింది
చెన్నై-సంత్రాగచి రైలు (06071/06072) అక్టోబర్ 21, 23, 28, 30.. నవంబరు 4, 6 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము 3.45కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సంత్రాగచిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!