NTV Telugu Site icon

World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!

Ind Vs Sa Details

Ind Vs Sa Details

2023 వరల్డ్ కప్లో భాగంగా.. రేపు (ఆదివారం) ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాప్లో ఉన్న టీమిండియా మంచి జోరు ఉంది. అటు సౌతాఫ్రికా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రేపు రసవత్తరంగా జరుగబోతుంది. ఇక 2003-2019 వరకు వరల్డ్ కప్లో గెలుపు ఓటములు చూసుకుంటే.. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు టీమిండియా గెలుపొందగా, ఒకటి సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే రేపు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

2019 వరల్డ్ కప్
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీలో ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ గ్రూప్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో కెప్టెన్ డుప్లెసిస్ 38, క్రిస్ మోరీస్ 42, ఆండిలే ఫెహ్లుక్వాయో 34, కగిసో రబాడా 31 పరుగులతో జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఇక భారత్ బౌలింగ్ లో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో చెలరేగాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ తలో రెండు వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత 228 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. 47.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ముందుగా క్రీజులోకి దిగిన ఓపెనర్లు శిఖర్ ధావన్ ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 122 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ 26, మహేంద్రసింగ్ ధోనీ 34 పరుగులు చేశారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు తీయగా.. క్రిస్ మోరీస్, ఆండిలే ఫెహ్లుక్వాయో తలో వికెట్ తీశారు. సెమీఫైనల్ వరకు చేరుకున్న భారత్.. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది.

2015 వరల్డ్ కప్
మెల్బోర్నో వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2015 టోర్నీలో గ్రూప్ దశలో టీమిండియా-సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 130 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు వహించారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ డకౌట్ కాగా, శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 46, అజింక్యా రహానే 79, ఎం.ఎస్ ధోనీ 18 పరుగులతో రాణించారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో మోరెన్ మోర్కెల్ 2 వికెట్లు తీయగా.. డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహీర్, పార్నెల్ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత 308 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా.. 40.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55, ఏబీ డివిల్లియర్స్ 30, ఆశిం ఆమ్లా 22, డేవిడ్ మిల్లర్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ తలో 2 వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు ఆసీస్ జట్టు టోర్నీ గెలుచుకుంది.

2011 వరల్డ్ కప్
2011 వరల్డ్ కప్లో నాగ్పూర్లో ఇండియా-సౌతాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా.. 48.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్ లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 73, సచిన్ టెండూల్కర్ 111 పరుగులతో రాణించినప్పటికీ.. చివరికి ఓడిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గౌతం గంభీర్ కూడా 69 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు కదిలించారు. ఇక ఆ తర్వాత మిగతా బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో డేల్ స్టెయిన్ 5 వికెట్లు తీసి.. టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక ఆ తర్వాత రాబిన్ పీటర్సన్ 2 వికెట్లు తీయగా.. మోరెన్ మోర్కెల్, కలీస్, డుప్లెసిస్ తలో వికెట్ సాధించారు. ఇక ఆ తర్వాత 298 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఓపెనర్లలో ఆమ్లా 61, గ్రేమ్ స్మిత్ 16 పరుగులు చేశారు. ఆ తర్వాత కలీస్ 69, ఏబీ డివిల్లియర్స్ 52, డుమినీ 23, డుప్లెసిస్ 25, జాన్ బోథా 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ పటేల్ 2, జహీర్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. ఈ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంకపై ఇండియా భారత్ ఘన విజయం సాధించింది.

2007 వరల్డ్ కప్
2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో బరిలోకి దిగిన టీంలో.. సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, జహీన్ ఖాన్, అనిల్ కుంబ్లే లాంటి ప్లేయర్లు ఉండటంతో కప్పు సాధిస్తుందని అభిమానులు ఆశించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి గ్రూప్ దశలోనే టీమిండియా ఇంటిబాట పట్టింది.

2003 వరల్డ్ కప్
2003 వరల్డ్ కప్లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగలేదు. ఈ టోర్నీలో ఫైనల్ వరకు వచ్చిన టీమిండియా.. కప్ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ వరల్డ్ కప్లో సౌరభ్ గంగూలీ కెప్టెన్గా వ్యవహరించారు. ఇక 2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యా్చ్ లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకోగా.. ఆస్ట్రేలియా గెలుపొంది టోర్నీని సొంతం చేసుకుంది.