NTV Telugu Site icon

200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం!

200 Years Old Message

200 Years Old Message

200 Year Old Letter: పురావస్తు శాఖ తవ్వకాల్లో దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి ఓ సందేశం తాజాగా బయటపడింది. ఓ పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వలంటీర్ల బృందానికి దొరికింది. ఈ వారంలో అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా.. సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో ఉన్నాయి.

పలు మేధో సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ‘పీజే ఫెరెట్’ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్టు లేఖలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన పలు పరిశోధనలు చేసినట్లు ఉంది. పురావస్తు శాస్త్రవేత్త ఫెరెట్ స్థానికంగా ప్రముఖు వ్యక్తి అని ఓ అంతర్జాతీయ మీడియా తమ కథనం పేర్కొంది. 200 ఏళ్ల క్రితం ఫెరెట్ మొదటిసారి తవ్వకాలు నిర్వహించినట్టు ఫ్రెంచ్ పట్టణం మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి.

Also Read: Senegal Migrants: సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!

తవ్వకాలు చేపట్టిన వలంటీర్ల బృందానికి సారధ్యం వహించిన గిల్లామ్ బ్లొండెల్ మాట్లాడుతూ… ‘మహిళలు వాసన వెదజల్లె లవణాలు కలిగిన ఉన్న చిన్నచిన్న సీసాలను మెడ చుట్టూ ధరించేవారు. గతంలో ఇక్కడ త్రవ్వకాలు జరిగాయని మాకు తెలుసు. కానీ 200 సంవత్సరాల క్రితం నాటీ ఈ సందేశాన్ని కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా వడ్రండి పనిచేసేవాళ్లు ఇలాంటి టైమ్ క్యాప్సూల్స్‌ వదిలిపెడుతుంటారు. కానీ పురావస్తు శాస్త్రంలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా మంది పురావస్తు శాస్త్రజ్ఞులు వారి పని పూర్తయ్యాక ఇంకా ఎవరూ రారులే అని భావిస్తుంటారు. ఇది గౌలిష్ గ్రామం అనే విషయం మాకు తెలుసు. ఈ ఊరిలో ఏం జరిగిందనేది తెలియదు. అది ప్రాముఖ్యమైన ప్రదేశమా? అన్నది కనుక్కోవాలి’ అని అన్నారు.