NTV Telugu Site icon

Robbery : ఆకాశ దొంగ.. తొలుత రైళ్లలో ఇప్పుడు విమానాల్లో..

Flight Rob

Flight Rob

దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి రూ. 7 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ప్రయాణికుడు కూడా రూ. 20 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. దేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీలు గాలించి ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేశ్‌కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చింది.

విమానాశ్రయంలోకి ప్రవేశించాక వయసు పైబడిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపేవాడు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాలను బ్యాగేజీ స్లిప్‌ల ద్వారా తెలుసుకునేవాడు. దానిని బట్టి వారి బ్యాగేజీల్లో ఏమేమి ఉండొచ్చో అంచనాకు వచ్చేవాడు. విమానంలోకి వెళ్లాక ఏదో ఒకసాకు చెప్పి తన సీటును వారి పక్కకి మార్చుకునేవాడు. ప్రయాణికులు ఇంకా లోపలికి వస్తున్న సమయంలో అదును చూసి బ్యాగేజీ సర్దుతున్నట్టు నటించి సామాన్లు కొట్టేసేవాడు.